![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -62 లో.. రామలక్ష్మి నిద్రపోతుంటే సీతాకాంత్ తన వంకే చూస్తుంటూ.. కవిత్వం రాస్తుంటాడు. రామలక్ష్మి నా జీవితంలో పరిచయస్థురాలు మాత్రమే అనే విషయం మార్చిపోయి.. నేను ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నానని మళ్ళీ తనలో తనే అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి గురించి ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాను.. వీలైనంత త్వరగా రామలక్ష్మిని పంపించెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు..
నా కూతురు నెలతప్పిన తర్వాతే సిరి, ధనల పెళ్లి అని మాణిక్యం అన్న విషయం సీతాకాంత్ గుర్తుకు చేసుకుంటాడు. వీలైనంత త్వరగా సిరి, ధనల పెళ్లి చేస్తానని అనుకోని.. వెంటనే తెలిసిన స్వామీజీకి ఫోన్ చేసి.. రేపు గుడికి వస్తున్నామని చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఇంట్లో అందరిని పిలిచి.. రేపు గుడికి వెళ్తున్నామని చెప్తాడు. ఇంత సడన్ గా ఎందుకని శ్రీలత అడుగుతుంది. వెళ్ళాలంతే.. మాణిక్యం ఫ్యామిలీ కూడా మనతో వస్తుందని సీతాకాంత్ చెప్పగానే.. శ్రీలత వద్దని చెప్తుంది. కానీ వాళ్ళు కూడా ఉండాలని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత ఇంత సడన్ గా మీ అన్నయ్య గుడికి ఎందుకు అంటున్నాడని సందీప్ ని శ్రీలత అడుగుతుంది. ఆ తర్వాత అదే విషయం శ్రీలతని సందీప్ అడుగుతాడు. సీతాకాంత్ ఎందుకు మనల్ని గుడికి తీసుకొని వెళ్తాన్నాడన్న విషయం పక్కన పెడితే.. రామలక్ష్మి, సీతాకాంత్ లు పెళ్లి చేసుకోలేదన్న విషయాన్ని అక్కడ బయటపెట్టాలని సందీప్ తో శ్రీలత అంటుంది.ఆ తర్వాత రామలక్ష్మికి " టీ " సీతాకాంత్ కాఫీ తీసుకొని వస్తాడు. రేపు గుడికి వెళ్తున్నాం.. అక్కడే సిరి ధనల పెళ్లి అని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మికి అభి వాయిస్ మెసేజ్ చేస్తాడు. నేను ఫారెన్ వెళ్తున్నాను.. నిన్ను ఒకసారి కలవాలని అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ తన తాతయ్యతో సిరి ధనల పెళ్లి విషయం గురించి మాట్లాడతాడు. కాసేపటికి స్వామిజీ చెప్పిన విషయాలు పెద్దాయనకు సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |